![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్ - 307 లో.. రాహుల్, రుద్రాణి మాట్లాడుకుంటారు. ఆ స్వప్న టార్చర్ చేస్తుంది రా.. చెప్పింది చేయకుంటే కేస్ పెడుతదంటరా అని రుద్రాణి అనగానే.. తను చెప్పింది నువ్వు చేస్తున్నావు కదా మమ్మీ అని రాహుల్ అనగానే.. ఇంకెంతకాలం చేయాలిరా అని రుద్రాణి అంటుంది. దానికి డెలివరీ అయ్యేవరకు చాలు అని రాహుల్ అనగానే.. రేపు పుట్టాక వాడి ముడ్డి కడుగు, మూతి కడుగు అని తర్వాత ఇంకా పనులు చెప్తుందంటు భాదపడుతుండగా.. ఏయ్ బయటేంటి ముచ్చట్లు అని స్వప్న అనగానే ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్తారు.
ఇక కళ్యాణ్-అనామికల గదిని వారి శోభనం కోసం ఓ పనివాడు వచ్చి పూలతో డెకరేట్ చేస్తుంటాడు. రాజ్ చూసి ఎవరు నువ్వు? నువ్వెందుకు డెకరేట్ చేస్తున్నావని అడుగగా.. కావ్య మేడమ్ చేయమందని అతను చెప్తాడు. తనే డెకరేట్ చేస్తానని ఇప్పుడు మనిషిని పెట్టిందేంటని రాజ్ అనుకొని కావ్య కోసం ఇల్లంతా చూస్తుంటాడు. కావ్య ఒక దగ్గర ఉండి ఆలోచిస్తుంటుంది. తన దగ్గరికెళ్ళిన రాజ్.. ఏంటి గది డెకరేట్ చేయకుండా ఏం చేస్తున్నావని అడుగగా.. ఎవరు చేస్తే ఏంటి.. పని జరుగుతుంది కదా అని కావ్య అంటుంది. నీ చేయి పడట్లేదేంటి పని తప్పించుకుంటున్నావా అని రాజ్ అనగానే.. అదేం లేదని కావ్య అంటుంది. ఇక మధ్యలో వచ్చిన అనామిక.. తనకి చేయడం ఇష్టం లేదేమో బావ అందుకే ఇలా చేస్తుందని రాజ్ తో అనామిక అంటుంది. అదేం లేదని కావ్య అంటుంది. ఎందుకు నాకు కళ్యాణ్ కి సంబంధించిన విషయం అంటే నీకు అంత అయిష్టత అని అనామిక అనగానే.. అయిష్టమేం కాదు నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి కావ్య వెళ్ళిపోతుంది. ఇక కిచెన్ లో ఏడుస్తూ ఉన్న కావ్య దగ్గరికి కళ్యాణ్ వెళ్ళి.. బాధకండి వదిన నేను ఉన్నాను. మీరు నాకు తోడుగా ఉండాలి కదా వదిన అని ధైర్యం చెప్తాడు. ఎవరు ఏం చెప్పిన ఎన్ని అన్నా నేను మీ వైపే ఉంటానని కావ్య అంటుంది. అన్నయ్య అలిగి వెళ్ళాడని కళ్యాణ్ అనగానే.. మీ అన్నయ్యని ఎలా పిలవాలో నాకు తెలుసని కావ్య అంటుంది. ఇక గదిలో రాజ్ ఉండగా కావ్య వెళ్లి.. ఏంటండి మీకు సామాజిక భాధ్యత లేదా?.. అని కావ్య అడుగుతుంది. శోభనానికే రమ్మంటున్నానని కావ్య అనగానే.. రాజ్ కంగారు పడతాడు. బుద్ది ఉందా అని రాజ్ అంటాడు. శోభనానికి రా అనడానికి, శోభనం గదిని డెకరేట్ చేయడామికి రా అని అనడానికి తేడా లేదా అని రాజ్ అంటాడు. మన్మధుడు పూలబాణం తొడుక్కొని రెడీగా ఉంటాడు. కానీ బాణం విరిగిపోతుంది. పూలు వాలి పోతాయి. తెల్లారిపోద్దని కావ్య కాసేపు ఆటపట్టిస్తుంది.
అలా ఇద్దరు కలిసి కళ్యాణ్-అనామికల గది డెకరేట్ చేయడానికి వెళ్తారు. తెలివిగా మాట్లాడుతున్నావని అనుకుంటున్నావా అని రాజ్ అంటే.. నాకే తెలివి ఉంటే నా శోభనం స్టోర్ రూమ్ లో ఎలా ఉంటుందని కావ్య అంటుంది. ఇందాక ఎందుకు డెకరేట్ చేయనన్నావ్? ఇప్పుడు ఎలా వచ్చావని రాజ్ అనగానే.. ఇందాక ఎవరో నన్ను బాధపెట్టారు. ఇప్పుడు ఎవరో నాకు సర్దిచెప్పారంటూ కావ్య తికమకగా చెప్పేసరికి రాజ్ కి అర్థం కాదు. ఆ తర్వాత అనామికని శోభనం గదికి అందరు కలిసి పంపిస్తారు. శోభనం గదిలోకి వెళ్ళిమ అనామిక.. పాలు తాగనని చెప్పి కళ్యాణ్ ని తాగమంటుంది. గదిలో ఉన్న పూలని చూస్తూ వర్ణిస్తుంటాడు కళ్యాణ్. ఇక అనామిక ఆపమని చెప్తుంది. ఇక గదిలో పూలు బాగా డెకరేట్ చేశారు కదా అని కళ్యాణ్ అనగానే.. అవునని అనామిక అంటుంది. తర్వాయి భాగంలో ఈ గది కావ్య డెకరేట్ చేసిందని కళ్యాణ్ అంటాడు. ఈ నక్లెస్ కావ్య సెలెక్ట్ చేసిందని అనామికతో కళ్యాణ్ అనగానే.. మన మధ్యకు కావ్య, అప్పులను ఎందుకు తీసుకొస్తున్నావంటూ అనామిక అనగానే.. నువ్వు అనవసరంగా గొడవ చేస్తున్నావని కళ్యాణ్ అంటాడు. అలా ఇద్దరి మధ్య గొడవ జరిగి అనామిక వచ్చి హాల్లో పడుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |